
పెరిగిన నిత్యవసరంలో వస్తువుల ధరలు కనుగుణంగా పిల్లల మెనూ చార్జీని పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు డిమాండ్ చేశారు. హాలియాలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఎంఈఓ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించి అనంతరం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయల వేతనం పెంచుతామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందని నేడు కేంద్రీకృత వంటశాల వైపు మొగ్గుచూపుతూ మధ్యాహ్న భోజన కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్త పరిచారు. సమయానికి బిల్లులు రాక పుస్తెలతాడు తాకట్టు పెట్టుకుని ఏజెన్సీ నిర్వహిస్తున్నారని గత 24 ఏళ్లుగా నిర్వహిస్తున్నారని, వీరందరినీ రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గుడ్లను ప్రభుత్వమే అందించాలని లేదా గుడ్డుకు అదనం బడ్జెట్ కేటాయించాలని పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 54 వేల కార్మికులు ఉన్నారని వీరి సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు లక్ష్మమ్మ రామలింగమ్మ, ఇద్దమ్మా, కమలమ్మ,నాగలక్ష్మి,అంజమ్మ తదితరులున్నారు.