
రాజంపేట మండలంలోని బసవన్న పల్లి గ్రామంలో ఉన్నా ఎంపీపీఎస్ పాఠశాలను ఎంఈఓ పూర్ణచందర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఉపాధ్యాయుల విద్యా బోధన, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్గొండ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కుష్టు వ్యాధి గురించి వైద్యులు రాజశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.