
రెంజల్ మండలం జూపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం అభ్యాసన అభివృద్ధి కార్యక్రమం అమలు తీరిపై మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు పరిశీలించారు. విద్యార్థుల బోధన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. విద్యార్థులకు సృజనాత్మకమైన విద్యాబోధన అందించాలని ఆయన పేర్కొన్నారు. అభ్యాసన అభివృద్ధి బోధనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటిసారిగా తమ పాఠశాలకు విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులను ఉపాధ్యాయ బృందం శాలువా కప్పి ఘనంగా సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. వెంకటలక్ష్మి, పి ఆర్ టి యు మండల అధ్యక్షులు టి. సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు కృష్ణ, రాజేశ్వర్, సాయన్న, ప్రభాకర్, రాములు, రాధా, లక్ష్మీ దేవమ్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.