మనసు పొరల్లో పూలవనం

బొట్టు బొట్టుగా
ఎరుపు మెరుపేదో ప్రవహిస్తూ
గుండెను చేరుతున్న అలజడి
ఒకే ఒక్క క్షణంలో
జలదరింపుల వాన
మనసంతా తడైపోయిన స్థితి
పదే పదే పరుగుతీస్తున్న
ప్రవాహ ఘర్షణకు
దేహమంతా పుండై పోతుంది
కొన్ని గాయాలతో
అంతర్గత కుహరం
సామూహిక మూలుగవుతుంది
ఏదో మూలన దాక్కున్న
ఆనంద మొలకొకటి
అంకురించి
నవ్వుల సిరులను పండిస్తుంది
లోలోపలి గది గోడలకు అంటిన
స్వేదపు చెమ్మకు
ఓ సౌందర్య గీతం
ఆలాపనను అందుకుంటుంది
యముకల గూళ్ళను
కప్పేసుకున్న
పంజరపు చీకటిలో
మాటల దివిటీ కాంతుల వేడి
మనసు కళ్ళను తడుతుంది
ఎన్నో దు:ఖపు రాశుల నడుమ
అమత బిందువోలే
కొన్ని అమూల్య వాక్కులు
మనసు పొరల్లో
పూలవనమై గుభాళిస్తాయి

-డా||కటుకోఝ్వల రమేష్‌, 9949083327