మనసు తడి ‘వనవాసి’

తప్పకురడా అరదరూ చదవాల్సిన నవల ‘వనవాసి’. తమ ఇంట్లో వుంచుకోవాల్సిన పుస్తకర. అరదరిచేతా చదివిరచాల్సిన పుస్తకం. ఈ నవలను బిభూతిభూషన్‌ బంధోపాధ్యాయ రాశారు. 1938లో మొట్టమొదటగా ప్రచురిరపబడిరది. దాదాపు 85 ఏండ్ల కిరదట రాసిన ఈ నవల… ఆయన అనుభవం. వంద ఏండ్ల కిరదట మన దేశంలో ఎంత చిక్కటి అడవి ఉండేది! ఇప్పుడెలా ఎడారిగా మారుతోరదో ఈ నవల చదివితే తెలుస్తురది. ఆనాటి మనుషులు ఆకలికి ఎంతగా అల్లాడేవారు. బతకడానికి ఎంత పోరాడేవారు? అరదులో కొరదరికి ఎంత స్వార్థ బుద్ధి ఉండేది! ఆదివాసులను తమ రాజ్యాల నురచి ఎట్లా తరిమివేశారు, ఒకనాటి రాజులైన వారు పశువులను కాస్తూ తిరడికి కూడా ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తురది. ఈ నవలలో ఎక్కడా స్త్రీని పొరపాటున కూడా అవమానిరచలేదు. ఆనాడు ఆదివాసులు రవికలను ధరిరచేవారు కాదు. అయినా ఎక్కడా స్త్రీని వర్ణించలేదు. ‘పుష్టి’గా ఉన్నారు అని మాత్రమే రాశారు. స్త్రీలలోని స్వచ్ఛతను, అమాయకత్వాన్ని, వారి మనసులను రాశారు. ప్రకృతి ఎంత అరదమైనదో, అరదులోని వెన్నెల మరెరత సురదరమైనదో వర్ణించారు. అడవి గురిరచి ఎంత వర్ణననో! అడవిలో ఎక్కడెక్కడో తనకు కనిపిరచిన పూల మొక్కలను, పండ్ల చెట్లను లవటులియా అడవిలో నాటి; అవి పూచినప్పుడు, కాచినప్పుడు ఆనందంతో పరవశిరచే అరదరూ అతడిని పిచ్చివాడుగా పిలిచే యుగళప్రసాద్‌, రాజ్‌గోరడుల సంతతి అయిన భానుమతి, నా అన్నవారు లేక బతుకుపోరు సాగిరచిన పదమూడేళ్ల ధాతురియా, కురతీ, మంచి… పలు పాత్రలు మనలను వెరటాడుతాయి. బ్రతుకు మీద మనిషి ఆశ, అడవి ప్రాముఖ్యత ఏంటో తెలుస్తురది.
– తాయమ్మ కరుణ