కబడ్డీ క్రీడాకారులను అభినందించిన మంత్రి

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : సౌత్ ఇండియా యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ఎంపికైన  హుస్నాబాద్ కబడ్డీ క్లబ్ క్రీడాకారులు గడిపె సిద్దు, ఎండీ ఆల్ఫాజ్, కోయిలకరి శ్రీశైలంను బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, సిద్దిపేట గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి  అభినందించారు. హుస్నాబాద్ నియోజకవర్గ పేరును కాపాడాలని మంత్రి సూచించారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని కనబరిచేలా కృషి చేస్తున్న కోచ్ మడక కృష్ణ ను అభినందించారు.