
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి రమణ కుమార్తె శ్రీజ బుధవారం మృతి చెందడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. శ్రీజ మరణ వార్త తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో జరిగే కార్యక్రమాలను అన్నిటినీ రద్దు చేసుకొని హుటాహుటిన హుస్నాబాద్ లోని ప్రభుత్వ అస్పుత్రికి వెళ్ళారు. అనంతరం కుమార్తె ను కోల్పోయిన బాధలో ఉన్న వడ్డేపల్లి రమణ కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. అనంతరం అంతిమ యాత్రలో శ్రీజ పాడే మోశారు.