
మాజీ జెడ్పిటిసి మైదం భారతి -వరప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబు, రామగిరి మండలంలోని ఆదివారం పేట గ్రామానికి చెందిన వరప్రసాద్ తల్లి దివంగత మైదం లలితమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి ఇంటికి వెళ్లి మృతురాలు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారికి మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి వెంట రామగిరి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మైదం మహేష్, మైదం నాగేశ్వర్, తదితరులు ఉన్నారు.