ప్రమాద బీమా చెక్కు అందజేసిన మంత్రి

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ గాయత్రి బ్యాంక్ ఖాతాదారుడు బోయిని అజయ్ ప్రమాదవశాత్తు మరణించడంతో బుదవారం మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా లక్ష రూపాయల ప్రమాద బీమా చెక్కును నామినీ  బోయిని అనసూర్యకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గాయత్రి బ్యాంకు సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాయత్రి బ్యాంక్ మేనేజర్ నారోజు రామకృష్ణ,  బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.