రామచంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి చెందడంపై రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాదులోని వారి నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.