బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

నవతెలంగాణ- భీంగల్
మండలంలోని బెజ్జాల గ్రామంలో బీజేపీ నాయకులు బెదిరింపులకు పాల్పడడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న తొనిగండ్ల రాజా గౌడ్ కుటుంబాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. మంత్రి వెంట డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నరసయ్య, గ్రామ సర్పంచ్ కోగోరు, ప్రతిభాసుమన్, ఎంపీటీసీ నరసయ్య లు ఉన్నారు.