పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే 

The minister who inaugurated the cotton buying center, MLAనవతెలంగాణ – అచ్చంపేట 
మండలం నడింపల్లి గ్రామ శివారు లో శ్రీ వేంకటేశ్వర కాటన్ జన్నింగ్ మిల్ లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి వర్యులు జూపల్లికృష్ణారావు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ లు ఆదివారం ప్రారంభించారు. ప్రభుత్వ నిర్ణయించిన నిబంధనల ప్రకారం రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు దళారులకు కత్తిని విక్రయించకుండా సీసీఐ కొనుగోలు కేంద్రంలోని పత్తిని విక్రయచాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్, మార్కెట్ చైర్మన్ రజిత మల్లేష్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, విజయ డైరీ చైర్మన్ నర్సయ్య యాదవ్, తదితరులు ఉన్నారు.