తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నేడు ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారని, అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని, దీంతోపాటు బాల బాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలు,అన్ని కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ఆయన తెలిపారు.