
తెలుగు ప్రజల అత్యంత సంప్రదాయ బద్దమైన భోగి, సంక్రాంతి పండుగలను ప్రతి ఒక్కరూ ఆనందోత్సహాలతో జరుపుకోవాలని రాష్ట్ర, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాల భోగి పండుగ సంబరాలు పంచె సంక్రాంతి పండుగ.. రైతులకు ఇష్టమైన కనుమ పండుగలను ప్రజలు సంస్కృతి, సంప్రదాయాల నడుమ వైభవంగా జరుపుకోవాలని అన్నారు. ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు. పూర్ణ కుంభం మంత్రి పోన్నం ప్రభాకర్ కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచరణలతో ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందచేశారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.