మైనార్టీ డిక్లరేషన్ ఎటు పోయింది. 

– ఎండి జహంగీర్ ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
నవతెలంగాణ – భువనగిరి
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ ఎటు పోయిందని అవాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నుండి జహంగీర్ ప్రశ్నించారు . మంగళవారం  భువనగిరి సుందరయ్య భవనంలో ఆవాజ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత సాధారణ ఎన్నికలకు ముందు ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ వక్ఫ్ భూముల పరిరక్షణ మైనార్టీల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఆవాస్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అప్పటి పిసిసి అధ్యక్షులు తెలంగాణలోని ముస్లిం మైనార్టీలకు ఎంతో గొప్పగా మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించారని మైనార్టీ డిక్లరేషన్ నమ్మి ముస్లింలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని ఆయన అన్నారు గద్దెనెక్కి సంవత్సరం గడిచినప్పటికీ మైనార్టీ డిక్లరేషన్ అమలు కలగా మిగిలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని మర్చిపోయారని అన్నారు. మైనార్టీలు ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారని గతంలో సచార్ కమిటీ నివేదిక కెసిఆర్ ప్రభుత్వంలో నియమించిన సుధీర్ కమిటీ నివేదికలు మైనార్టీలో స్థితిగతులు ఎంత అధ్వానంగా ఉన్నాయో ప్రభుత్వాలకు చెప్పినప్పటికీ ప్రభుత్వాలు ఈ విషయాన్ని మరుగున పరుస్తున్న యని అన్నారు. మైనార్టీ డిక్లరేషన్ లో రిజర్వేషన్లు పెంచుతామని మైనార్టీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్వయం సహాయక స్కీములు ఏర్పాటు చేస్తామని, బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తామని చెప్పారు. మైనార్టీలు విద్యాపరంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటామని షాదీ ముబారక్ మైనార్టీ కార్పొరేషన్ రుణ సహాయం ఇతర అనేక విధాలుగా మైనార్టీలను నమ్మించి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ 15 నెలలు అధికారం వెలగబెట్టిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకుపోవడం లో మైనార్టీల అభివృద్ధిపై వారికి ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సైతం 50 లక్షల కోట్ల బడ్జెట్లో మైనార్టీలకు రూ. 3000 కోట్లు కేటాయించడం తో మైనార్టీలపై బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్న కసి తీర్చుకున్నారని అన్నారు. దేశ లో మైనారిటీల జనాభా ప్రకారం కేటాయింపులు చూస్తే ఈ బడ్జెట్లో పాయింట్ .006 ఉందని దేశంలో 15 శాతం ఉన్న ప్రజలు దీనవస్థలను నెట్టివేస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని “దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్” అని గురజాడ సూక్తిని గుర్తుచేశారు. ఈ సమావేశాంలో వ్యవసాయకర్మికసంఘం రాష్ట్ర నాయకులు కొండమడుగు నరసింహ ఐద్వా నాయకురాలు బట్టుపల్లి అనురాధ, సిఐటియు నాయకులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ వెంఠనే మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిషత్ లో మైనార్టీల హక్కులకోసం జరిగే పోరాటాలలో కలసి ఉద్యమిస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమం లో తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు బట్టు రామచందయ్య, మైనార్టీ నాయకులు ఎగ్బాల్ చౌదరి, ఆవాజ్ జిల్లా నాయకులు ఎస్కే లతీఫ్, మహమ్మద్ అక్మల్, డాక్టర్ షేక్ హమీద్ పాషా, తురక కాశల సంఘం రాష్ట్ర అధ్యక్షులు  ఇమాంఇమాంపాష,   ఎండి యాకూబ్ అలీ షేక్ ఖాసిం, ముక్తార్ హుస్సేన్, ఎండి జహీర్, ఎండి సలీం,  గొర్రెల మేకలు పెంపక సంఘం జిల్లా నాయకులు దయ్యాల నరసింహ, ఎండి అమీర్, ప్రజా ఫ్రంట్ నాయకులు మహేష్ యాదయ్య, నరసింహ, ఆవాజ్ పట్టణ నాయకులు మొహమ్మద్ సాజిద్, మహమ్మద్ రియాజ్, మొహమ్మద్ సోహెల్  పాల్గొన్నారు