నవతెలంగాణ-శంషాబాద్
కనపడకుండా పోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మం డల పరిధిలోని మదనపల్లి గ్రామానికి చెందిన వారణాసి మనీలా-గోవ ర్ధన్ కొడుకు వారణాసి వికాస్ (12) తల్లిదండ్రుల గొడవ కారణంగా ఈ నెల 7తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఈ విషయంపై శంషా బాద్ పోలీస్‌స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీ సులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఉదయం శంషాబాద్‌లో అతన్ని గుర్తించి పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాలు డి తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రు లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని అప్పగించి కేసును దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.