రాష్ట్ర అభివృద్ధియే  బీఆర్ఎస్ ధ్యేయం

నవతెలంగాణ – నూతనకల్
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి బీఆర్ఎస్ ధ్యేయం అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ  సందర్భంగా ఆ పార్టీ పతాక ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ..ఈ గులాబీ జెండా స్వరాష్ట్రం కోసం ఆవిర్భవించిన జెండా అని, పోరాడి సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన జెండా అని, తెలంగాణ ఆత్మగౌరవ జెండా గులాబీ జెండా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలు గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాజుల తిరుమలరావు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బత్తుల విజయకుమార్, నాయకులు మహేశ్వరం మల్లికార్జున్, అధికార ప్రతినిధి బత్తుల విద్యాసాగర్, మూరగుండ్ల సైదులు,కొచ్చర్ల బాబు,గిరి,సురేందర్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.