అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

The MLA couple participated in the funeralనవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో గురువారం మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత కార్యదర్శి పలకల శ్రీనివాస్ రెడ్డి,తండ్రి ప్రభాకర్ రెడ్డి, (50) బుధవారం గుండెపోటుతో మృతి చెందగా ఆయన అంత్యక్రియలు గురువారం జరిగాయి. మరణ వార్త తెలియగానే ఎమ్మెల్యే, హైదరాబాద్ నుంచి నేరుగా గద్దపాక గ్రామానికి సతీసమేతంగా విచ్చేశారు.ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి భౌతిక కాయంపై ఎమ్మెల్యే దంపతులు డాక్టర్ అనురాద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు.వైకుంఠధామం వద్ద ప్రభాకర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యే తో పాటు పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి,శంకరపట్నం, మానకొండూరు గన్నేరువరం,బెజ్జంకి, ఇల్లంతకుంట,మండలాల అధ్యక్షులు గోపగోని బస్వాగౌడ్, నందగిరి రవీంద్ర చారి, మోరపల్లి రమణారెడ్డి, ముస్కు ఉపేందర్ రెడ్డి, ముక్కిస రత్నాకర్ రెడ్డి, రాఘవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పద్మాకర్ రెడ్డి,సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి,గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.