నవతెలంగాణ భైంసా: ఇటీవల భారీ వర్షాలు కురవడంతో బైంసా మండలంలోని వానల్ పాడ్ గ్రామానికి చెందిన కదం భోజరాం పటేల్ అనే యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందగా బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు చెక్కును అందజేశారు. విప్పత్తుల నిర్వహణ శాఖ ద్వారా ఈ సహాయాన్ని అందించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇంచార్జి మంత్రి సీతక్క కు ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ తో పాటు మాజీ ఎంపిపి అబ్దుల్ రజాక్, నాయకులు గణేష్ పటేల్, సొలంకిభీంరావు, తాలోడ్ శ్రీనివాస్, సచిన్ పటేల్, చందర్ పటేల్, సాయరెడ్డి, భూమేష్ తదితరులు ఉన్నారు.