మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామ వారాంతపు సంతలో పర్యటించి, సంతలో కూరగాయలు విక్రయించడానికి వచ్చిన కూరగాయల వ్యాపారులతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముచ్చటించారు. అంతేకాకుండా వారి దగ్గర కూరగాయలు కొనుగోలు చేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఒక సామాన్యుడిలా సంతలో పర్యటించి తమ సమస్యలు తెలుసుకొని కూరగాయలు కొనుగోలు చేయడం పట్ల రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంటా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.