కలెక్టర్ తో ప్రత్యేకంగా సమావేశమైన ఎమ్మెల్యే

The MLA had a special meeting with the collectorనవతెలంగాణ – మద్నూర్ 
ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జుక్కల్ నియోజకవర్గంలోని అర్హులకు పంపిణీ చేయాల్సిన కొత్త రేషన్ కార్డులు, రోడ్లు, అభివృద్ధి పనులు  ఇతర సమస్యల గురించి వారితో చర్చించారు. జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పట్ల జిల్లా అధికారులంతా సహకరించాలని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్కు ఇతర అధికారులకు కోరారు.