రోడ్డుకు మొర్రం పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే 

The MLA has started work on the roadనవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా, కొడిచర, గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా చెడిపోవడం ఇరు గ్రామాల ప్రజలకు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక, మీ బాధలు నేను చూడలేను అంటూ జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆ రెండు గ్రామాల రహదారి రోడ్డుకు మొరం మరమ్మత్తులు చేయించే పనులకు బుధవారం నాడు శంకుస్థాపన చేశారు, ఏళ్ల తరబడి రోడ్డు బాగు లేక ఇబ్బందులు ఎదుర్కొని దానికి ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు వెంటనే స్పందిస్తూ మొరం రోడ్డు పనులు ప్రారంభించి రోడ్డును బాగు చేయించడం పట్ల  మద్నూర్ మండలం చిన్న ఎక్లార, కొడిచర, గ్రామా ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు. జుక్కల్ నియోజకవర్గం లో రోడ్ల సౌకర్యం బాగోలేదని ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోడ్డు సౌకర్యం గురించి ప్రజలు నా దృష్టికి తీసుకురావడం సంతోషకరమైన విషయమని, చెడిపోయిన రోడ్డు మొరం మట్టితో బాగు చేయించి, ఆ తర్వాత బీటీ రోడ్డు వేయించే బాధ్యత తీసుకుంటానని ఇరు గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చారు. ,వెంటనే స్పందించిన ఎమ్మెల్యే  ప్రజలు ఇబ్బందులు పడకూడదని టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టి రోడ్డు వేయిస్తున్నారు. మొరం మట్టి రోడ్డు పనుల నిర్మాణంలో చిన్న ఏక్లారా కొడిచెర గ్రామానికి నాయకులు ఆయా గ్రామాల పెద్దలు గ్రామస్తులు తోపాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.