నవతెలంగాణ-దుబ్బాక
అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని చిన్ననిజాంపేట గ్రామంలో నిర్మించిన పలు కుల సంఘ భవనాలను సర్పంచ్ షేర్ల రచన కైలాష్,ఎంపిటిసి మంగళగిరి అంజమ్మ తో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.5 లక్షల వ్యయం (డిఎంఎఫ్ టి నిధులు)తో కురుమ సంఘం,అలాగే రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన ముదిరాజ్ సంఘ భవనాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. బొప్పాపూర్ గ్రామంలో పంచాయతీరాజ్ నిధులతో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన గౌడ సంఘం భవనానికి సర్పంచ్ బండమీది బాలమణి మల్లయ్య, గౌడ సంఘం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వెంట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య,ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, జెడ్పిటిసి కడ్తాల రవీందర్ రెడ్డి, ఏఎంసి చైర్ పర్సన్ చింతల జ్యోతి కష్ణ, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.