
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. నాగారం, భారతి రాణి కాలని,పూజారి కాలని,బాబాన్ సాబ్ పహాడి,దొడ్డి కొమురయ్య కాలని,ధర్మపురి హిల్స్, కాలనీలని పరిశీలించారు.బాబాన్ సాబ్ పహాడి వద్ద మహబూబ్ ప్యాలెస్ ఫంక్షన్ హాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వసతులని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు.ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ..గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని పలు సూచనలు తెలియజేశారు. విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం జరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసాము.పునరావాస కేంద్రాలలో భోజన వసతి మంచి నీటి వసతి కల్పించామని తెలియజేశారు.
వర్షం వరద తగ్గు ముఖం పట్టే వరకు పునరావాస కేంద్ర లలో ఆశ్రయం పొందండి అని తెలిపారు. నగర పాలక సంస్థ కేంద్ర కార్యాలయంలో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము.08462-221001 నంబర్ కాల్ చేసి సహాయం పొందండి అని తెలియజేశారు. నిజామాబాద్ నగర ప్రజలకు అర్బన్ ఎమ్మెల్యే భారీ అతి భారీ వర్షాల కారణంగా పలు సూచనలను తెలియజేశారు. అవసరమైతేనె తప్ప ప్రజలు ఎవరు బయటకు రాకూడదు అని తెలిపారు.దూర ప్రయాణాలను వర్షాలు తగ్గే వరకు వాయిదా వేసుకోవాలన్నారు.విద్యుత్ స్తంభాలు షాక్ కొట్టే అవకాశం ఉంది.కావున విద్యుత్ స్థంబాలకు దూరంగా ఉండడం మంచిదని తెలిపారు.శిథిలా భవనాల్లో ఉంటే వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్ళండి అని తెలిపారు. చెరువులు, కాలువలు, కుంటల వద్దకు చిన్న పిల్లలు వెళ్లకుండా చూడండి. వరద నీటి విష కీటకాలు వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండండి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్, డిప్యూటి మేయర్ ఇద్రిస్ ఖాన్, బీఆర్ఎస్ నాయకులు, దండు శేఖర్, మున్సిపల్ అధికారులు సాగర్, మురళి, రషీద్ తదితరులు పాల్గొన్నారు.