వంద పడకల ఆస్పత్రి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే

– అనువైన స్థలం ఎదో రెండు రోజుల్లో  తెల్చాలని అధికారులకు ఆదేశం
– స్థల మార్పిడికి గ్రామస్థుల సూచన
నవతెలంగాణ – దర్పల్లి : మండల కేంద్రములో గత ప్రభుత్వం వంద పడకల ఆస్పత్రి నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి అనుగుణంగా అప్పుడే ఎన్నికలు సమిపించడంతో అందుకు కావలసిన స్థల పరిశీలన చెయ్యాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించాగా అప్పుడు అధికారులు హుటాహుటిన మండలకేంద్రములోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఆసుపత్రి నిర్మించేందుకు అనువైన స్థలాన్ని నిర్ణయించారు. ఉన్నత ఆశీకారులు సైతం పరిశీలించి మూడున్నర ఎకరాల్లో ఆసుపత్రి నిర్మించేందుకు ఒప్పందానికి వచ్చి ప్రాభుత్వానికి నివేదిక అందించారు.అంతలో స్థలాన్ని ఫైనల్ చేసి అధికారులు స్థల చదును కార్యక్రమాలు పూర్తి చేసి గత నవంబర్ 5న అప్పటి ఆరోగ్యమంత్రి హరీష్ రావు, చేతుల మీదుగా అట్టి స్థలంలో భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమము నిర్వహించారు.పనులు ఎదో కారణంవల్ల పనులు ప్రారంభం కాలేదు. ఇంతలో ఎన్నికలు అనంతరం ప్రభుత్వం మారింది. దింతో ఆసుపత్రి నిర్మాణం పనులు జరగలేవు ఇంతలో ఇటీవల ఆసుపత్రి నిర్మాణపు పనుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాటిని ఒకసారి పరిశీలించి ఎమ్మెల్యే గారి అభిప్రాయాన్ని తెలుపాలని అధికారులు కోరగా, శనివారము ప్రజపాలన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడగ, స్థలం తక్కువ అవుతుంది. ఇక్కడ మూడున్నర ఎకరాలు భూమి ఉంది. పూర్తిస్తాయి భావనలు రావడం కష్టంగా ఉందని తెలుపడంతో, అలాంటప్పుడు ఇట్టి విషయాన్ని అప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు అని అధికారులకు ప్రశ్నించారు.పాత భవనం ఉన్న చోటనే నూతన భావనలు అక్కడైతేనే బాగుంటుందని, అక్కడ 5 ఎకరాల స్థలం ఉందని ఎమ్మెల్యే దృష్టికి తెగ, అక్కడే నిర్మిస్తే ప్రస్తుతం ఉన్నట్లుండి,ప్రజలకు వైద్య సేవలు ఇబ్బందిగా మారుతాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వైద్య సేవలు ఇతర చోటికి మార్చేందుకు మార్గం ఏమైనా ఉందా! అనే విషయంలో మండలకేంద్రములోని బాలూర వసతి గృహం ఖాళీగా ఉందని ప్రస్తుతం ఆసుపత్రిని అక్కడకు షిఫ్ట్ చేసి, పాత ఆసుపత్రి భావనలు, ఎలాగో శిదిలావస్థకు చేరిన సందర్బంగా అట్టి భవనాలకు తొలగించి అదేచోట నూతన భావనము నిర్మించినట్లయితే బాగుంటుంది అని, భావనలు పూర్తి అయ్యే వరకు సుమారు 2నుండి 3 సంవత్సరాల సమయం పట్టా వచ్చు, అప్పటి వరకు మండల కేంద్రములోని హాస్టల్ భావనలో వైద్య సేవలు జరుపుతే బాగుంటుందని ఎమ్మెల్యే దృష్టకి తెగ సరే అది వైద్య సేవలకు సరిపోతుందా అని వైద్యులకు అడుగగా సరిపోదని సమాధానం ఇవ్వడంతో ఇలాంటి వారు అప్పుడు ఎందుకు తప్పు తోవా పట్టించారాని అధికారులపై ఆగ్రహం వెక్తం చేశారు. జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఆసుపత్రి నిర్మాణం ఎక్కడ కట్టితే బాగుంటుందో, అధికారులు, స్థానిక నాయకులు కలిసి, పరిశీలించలని, ఎప్పటిలాగా వైద్య సేవలకు ఇబ్బందులు లేకుండా, హాస్టల్ భవనం పరిశీలించండని తెలిపారు, హాస్టల్ పక్కనే మరో హాస్టల్ ఉందని అది ప్రస్తుతం కొనసాగుతుందని అవసరము అనుకుంటే అట్టి హాస్టల్ ను కూడా తీసుకొని రెండు హాస్టళ్ళలో ఆసుపత్రి కొనసాగించే విధంగా చూసి, ప్రస్తుతం ఒక హాస్టల్ లో ఉన్న విద్యార్థులను మరో ప్రభుత్వ భవనం చూసి అక్కడకు మార్చినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రేస్ మండల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తెగ, చుడండి ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా ఆసుపత్రి ఎక్కడ కట్టితే బాగుంటుందో తెల్చాలని, భవిషత్తు ను దృష్టిలో ఉంచుకొని అందరికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఫైనల్ చెయ్యాలని రెండు రోజుల్లో నివేదిక అందించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఏదేమైనప్పటికి వంద పడకల ఆసుపత్రి మండల కేంద్రములో వచ్చింది వాస్తవమే అయినప్పటికీ అదెక్కడా నిర్మాణం జరుగుతుందో మరో వారం, ఓదిరోజుల్లో తెలనుందని ఊహగణాలు వినిపిస్తున్నాయి. ఎక్కడ కట్టిన ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు త్వరగా స్థల పరిశీలన చేసి పనులు ప్రారంభించేందుకు కృషి చెయ్యాలని మండల వాసులు కోరుతున్నారు.