నియోజకవర్గ సమస్యలపై అధికారులను కలిసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – ఆర్మూర్  

స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శనివారం ముఖ్యమంత్రి ఓ ఎస్ డి అజిత్ రెడ్డి, అడిషనల్ సెక్రెటరీ శ్రీమతి సంగీత సత్యనారాయణ లను సెక్రటేరియల్ లో కలిసి నియోజకవర్గ సమస్యలపై వివరించినారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూలు, పదివేల ఇళ్ల గురించి, పెండింగ్లో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ పై చర్చించినారు. అధికారులు సానుకూలంగా స్పందించినట్టు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపినారు.