కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఎమ్మెల్యే

నవతెలంగాణ – రాయపర్తి
కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటా అని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఇల్లంద వ్యవసాయ మార్కెట్  మాజీ వైస్ చైర్మన్, మండల ముఖ్య నాయకులు ముద్రబోయిన వెంకన్న  ప్రమాదవశాత్తు గాయపడగా బుధవారం ఎమ్మెల్యే తిర్మలాయపల్లి గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి బాగోగులు తెలుసుకొని పరామర్శించారు. తదుపరి జయరాం తండాకు చెందిన గుగులోత్ మారోని, పానిస్ తండాకు చెందిన భూక్య సుమలత ఇటీవల అకాల మరణం చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆమెతో పాటు తొర్రూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్య  నాయక్, మండల అధ్యక్షుడు ఈదులకంటి  రవీందర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ఎండి మహమూద్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అఫ్రోజ్ ఖాన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.