
ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై ఎలాంటి సందేహాలను అధికారులను అడిగి తెలుసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ లు తెలిపారు. మంగళవారం సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ, ఉప్పునుంతల గ్రామపంచాయతీ ,అచ్చంపేట మున్సిపాలిటీ 7వ వార్డులో గ్రామసభ నిర్వహణ, గ్రామసభకు హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ,, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియను పరిశీలించారు.ఉప్పునుంతల గ్రామపంచాయతీ , అచ్చంపేట మున్సిపాలిటీ 7వ వార్డు, సభలో ఏర్పాటుచేసిన గ్రామసభకు డాక్టర్ వంశీకృష్ణ, తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు ప్రభుత్వం జనవరి 26వ తేదీన ప్రవేశపెట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హులైన వారిని, అనర్హులైన వారిని గుర్తించేందుకు గ్రామసభ నిర్వహించినట్లు వెల్లడించారు. రేషన్ కార్డుకు సంబంధించి గతంలో దరఖాస్తు చేయనీ వారి నుండి గ్రామసభ ద్వారా అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా పథకం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యంతో , వ్యవసాయ యోగ్యం కానీ భూములను గుర్తించి గ్రామ సభ ద్వారా తెలియజేస్తున్నట్లు సూచించారు. అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్ధాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా నిర్ధారించామని అన్నారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో సంవత్సరానికి 12 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఎలాంటి సాగు భూమి లేని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేసిన వ్యవసాయ కూలీల కుటుంబాలను అర్హులుగా గుర్తించామన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్దారించామని తెలిపారు.
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్ధాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. ప్రజలు దరఖాస్తు చేసుకున్న వాటిని సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, అనవసర ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామ సభలలో దరఖాస్తులు అందజేయవచ్చని, వీలుపడని వారు ఈ నెల 26 తరువాత ఎప్పుడైనా మండల కార్యాలయాలలోని ప్రజా పాలన సేవా కేంద్రాలకు వెళ్లి సంబంధిత పత్రాలను జాతచేస్తూ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి, అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో సంవత్సరానికి రూ.12 వేల అందించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం మేనిఫెస్టోలో రూపొందించిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. గ్రామ సభలో ఆయా పథకాల కింద ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోని వారితో పాటు, అర్హత కలిగి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారి నుండి కూడా అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఈ మేరకు వివిధ పథకాల ద్వారా అర్హులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా గ్రామ సభ వీటికి ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి చిన్న ఓబులేసు, డిపిఓ రామ్మోహన్రావు ,అచ్చంపేట ఆర్డిఓ మాధవి, మండల స్పెషల్ ఆఫీసర్ చందులాల్, ఉప్పునుంతల తాహసిల్దార్ ప్రమీల , స్పెషల్ ఆఫీసర్ రమేష్ ,అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ ,తదితరులు పాల్గొన్నారు.