నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణం కోసం గ్రామస్తుల విన్నపాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు విన్నవించుకొని సీసీ రోడ్డు నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు అభినందనలు తెలియజేశారు. సీసీ రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనులను ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దత్తు గ్రామ పెద్దలు శంకర్ పటేల్ గ్రామ యూత్ అధ్యక్షులు అంకుష్ కాంగ్రెస్ కార్యకర్తలు అబిత్ సంజు జయవంతు బాలాజీ గ్రామస్తులు పరిశీలించారు. ఆలయం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణంతో ఎంతో అభివృద్ధి కనిపించడం పట్ల గ్రామస్తులంతా ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.