
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కుటుంబ సభ్యులకు పై చదువుల కొరకు రుణాలు అర్హులకు మంజూరు చేయడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ముందుకు వస్తున్నాయని కే డి సి సి చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. శుక్రవారం శంకరపట్నం మండలంలోని గద్దపాక గ్రామంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ పంపు పునః ప్రారంభోత్సవ కార్యక్రమo సహకార సంఘం అధ్యక్షుడు గుర్రాల తిరుపతి రెడ్డి, ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కే డి సి సి చైర్మన్ కొండురు రవీందర్రావు లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంకు మళ్లీ పునః ప్రారంభంలో ఉంచడం రైతులకు శుభ పరిమాణం అన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలు ద్వారా గత రెండు సంవత్సరముల నుండి పెట్రోల్ బంకు మూసి వేయబడింది చైర్మన్ కొండూరు రవీందర్రావు సహకారంతో మళ్ళీ పెట్రోల్ బంకులను తెరిచి నందుకు చైర్మన్ తిరుపతి రెడ్డికి కృతజ్ఞత తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 తారీకు లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీని ప్రభుత్వం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కే డి సి సి చైర్మన్ రవీంద్ర రావు మాట్లాడుతూ సహకార సంఘాలు కార్పొరేషన్ బ్యాంకులకు తీసిపోకుండా సంఘ సభ్యులకు వ్యవసాయం పైన గృహ నిర్మాణాలకు పైచదువుల కొరకు విదేశాలకు పంపే రైతు కుటుంబ సభ్యులకు అర్హులను గుర్తించి రుణాలను అందించే సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. విద్యావంతులైన యువకులకు ప్రభుత్వం ఎన్నో విధాలైనా రుణాలను అందిస్తుందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా పంట రుణాలను కార్పొరేషన్ బ్యాంకుల కంటే సహకార బ్యాంకులో ముందంజలో ఉందన్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు గుర్రాల తిరుపతిరెడ్డి, మెట్టుపల్లి చైర్మన్ ప్రొద్దుటూరు సంజీవరెడ్డి, తాడికల్ చైర్మన్ కేతిరి మధుకర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, మత్స్యగిరి స్వామి ఆలయ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, సహకార సంఘ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.