
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన చౌలవార్ హనుమాన్లు స్వామి అనే వ్యక్తి ప్రమాదంలో గాయాల పాలయ్యారు. ఆయనకు జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మెరుగైన చికిత్సల కోసం హుటాహుటిన హైదరాబాద్ కు తరలించి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సల కోసం సోమవారం రాత్రంతా ఆసుపత్రిలోనే మకాం వేశారు. కార్యకర్తకు అండగా ఎమ్మెల్యే ఆసుపత్రి వైద్యులతో గాయపడ్డ కార్యకర్త గాయాల గురించి అడిగి తెలుసుకుంటూ, మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. కార్యకర్తలకు అండగా ఉంటాను అనటానికి అనుమాండ్ల స్వామికి వెంట ఉండి చికిత్సలు జరిపిస్తూ, ఎమ్మెల్యే తమ నిజాయితీని నిరూపించుకున్నారు. ఎమ్మెల్యే అండపట్ల జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే పనితీరుపై అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి ఆసుపత్రిలోనే మకాం వేసి కార్యకర్తను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే అందించే కృషి కార్యకర్తలకు అండ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నిరూపించుకున్నారు. గాయాల పాలైన కార్యకర్తకు కాపాడుకునేందుకు ఎమ్మెల్యే అండ నియోజకవర్గం ప్రజలకు ఎంతగానో సంతోష పరిచింది. ఎమ్మెల్యే వెంట సాయి పటేల్, ఇతర నాయకులు ఉన్నారు.