నవతెలంగాణ-భిక్కనూర్: భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి అనారోగ్యం కారణంగా ఇటీవల కాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స నిర్వహించుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హనుమంత్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనారోగ్య సమస్యకు గల కారణాలు తెలుసుకొని ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ పరామర్శలో ఎమ్మెల్యే వెంటా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ లక్ష్మీ రాజలింగం, సొసైటీ చైర్మన్ రాజా గౌడ్, ఏఎంసీ వాయిస్ ఛైర్మెన్ రాజమౌళి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.