
మండలం రాజుర గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అప్ప పెద్ద పోతన్న, తోట భాస్కర్ , మన్మధ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎర్ర భోజన్న తల్లి, హవర్గ గ్రామానికి గ్రామానికి చెందిన రామకృష్ణ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శనివారం ఆయా గ్రామాలకు చేరుకొని వారి చిత్రపటలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయరెడ్డి, మురళీ, రాజుర మాజీ సర్పంచ్ సుందరగిరి ముత్తగౌడ్, జిల్కరి సాయి ప్రసాద్, మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, జుట్టు భూమన్న తదితరులు ఉన్నారు.