అధికారుల పని తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే..

– తప్పలుచేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం
– సమావేశం కు హాజరు కానీ విద్యుత్ శాఖ ఏఈ పైబ్ ఆగ్రహం 
నవతెలంగాణ-కుభీర్: గత ప్రభుత్వం లో మాదిరిగా ప్రస్తుతం నిర్లక్షంగా విధులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అధికారులను హెచ్చరించారు. మండలంలోని మండల పరిషత్  కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా అధికారులు తమ తమ నివేదికలను సభ మందిరంలో చదివి  వినిపించారు .వ్యవసాయ శాఖ మండల అధికారి  వికర్ హైమద్ మాట్లాడుతూ ఉండగా కొందరు రైతులు గ్రామ స్థాయి ఏఈఓలు ఇష్ట రీతిలో గ్రామంలోనే కూర్చుని పంట నమోదు చేయడం వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారని అన్నారు.క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నమోదు చేస్తే రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అన్నారు.ఏఈఓ లు చేసిన తప్పిదం వల్ల రబీ సీజన్లో జొన్న పంటను చాలా మంది దళారులు మహారాష్ట్ర నుంచి తెచ్చి మన మార్కెట్లో విక్రహించడం జరిగింది.రికార్డ్ స్థాయిలో జొన్న పంట మార్కెట్ కు రావడంతో అసలైన రైతులకు తీవ్ర నష్టం వట్టిలిందని మండల వ్యవసాయ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఈఓ సమాధానం ఇచ్చారు.అదే విదంగా విద్యుత్ శాఖ ఏఈ సమావేశానికి హాజరు కాకా కింద స్థాయి అధికారికి పంపడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి ఎంపీడీఓ మోహన్ సింగ్ కు ఏఈ కి నోటీస్ ఇవ్వాలని అదేశనిచ్చారు.దింతో పాటు ఉపాధిహామీ లో 8కోట్లా 46లక్షలతో మండలంలో వివిధ గ్రామంలో పలు రకాల  పనులు చెప్పట్టడం జరిగిందని ఉపాధి హామీ ఏపీఓ హరిలాల్  సభ ముందర చదివి వినిపించారు .
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ ..
మండలంలోని ఆయా గ్రామంలో ఇటీవల వివిధ కారణాల వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న 35మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి సుమారు 4లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.అన్తరం బెల్గం గ్రామంలో ఇటీవల పాము కాటు తో మృతి చెందిన బాలుని కుటంబ సభ్యులను పరామర్శించారు.ఈకార్యక్రమంలో మండల అధ్యక్షడు ఏశాల దత్తత్రి, పైడిపెళ్లి గంగాధర్.మాజీ జడ్పీటీసీ రేఖ మోహన్ మాజీ ఎంపీపీ రాథోడ్ శంకర్ ,బోర్డ్ డోరెక్టర్ గంగా శేఖర్,ఎంపీడీఓ మోహన్ సింగ్ తహసీల్దార్ సోము ఎం ఈ ఓ చంద్రకాంత్ వ్యవసాయ అధికారి వికర్ హైమద్ మండల అధికారులు నాయకులు ,లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.