నవతెలంగాణ – లోకేశ్వరం
నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తన ద్యేయమని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని కొందరు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. అనంతరం 82 మంది లబ్దిదారులకు దాదాపు రూ. 20 లక్షలు విలువచేసే చెక్కులను అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పైనాస్ కమీషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారం అందుకున్న ఎంపిడిఓ సోలమాన్ రాజ్ ను శాలువాతో సన్మానించారు.
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఎల్ఏ
అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో విద్యుత్, డ్రైనేజీ , రోడ్లు, ద్వాక్ర మహిళ సంఘాల సమస్యలపై రెవెన్యూ , ఐకేపీ , పంచాయతీ రాజ్ , అధికారులకు పలుమార్లు విన్నవించినా ఆయా శాఖల అధికారులు పేడ చెవిన పెట్టారని( నిర్లక్షం వహించారని) ప్రజలు ఎంఎల్ఏ కు తెలుపగా అధికారులపై ఎంఎల్ఏ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఉన్నది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అని వారు కడుతున్న పన్నులే మనం జీతాలు తీసుకుంటున్నామని ప్రతిఒక్క అధికారి చేస్తున్న పని పై మనసు పెట్టీ మానవతా దృక్పథంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.గ్రామాలలో ఉన్నా సమస్యలను గుర్తించి, తనకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, బీజేపీ మండల కార్యదర్శి జయసాగర్ రావ్, చిన్నారావ్, ఒరికె పోతన్న, ప్రవీణ్ ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ,బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు , ఎంఆర్ఓ ఆర్కా మోతిరాం, ఎంపిడిఓ సోలమన్ రాజ్ , ఏఈ శివకుమార్, సూపెరిడెంట్ వెంకట రమేష్ ,సీనియర్ అసిస్టెంట్ సురేష్ గౌడ్, ఏపిఓ జగన్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓ లు , ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.