– కోట్ల రూపాయలు అవినీతి పాలు
– బాన్సువాడ ఆస్పత్రి దుస్థితి
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్మించిన 50 పడకల ఆస్పత్రి భవనం పనుల్లో నాణ్యత లోపించడంతో భవనం 25 ఏండ్లకే శిథిలావస్థకు చేరడంతో అధికారులు శనివారం నుంచి కూల్చివేస్తున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఆస్పత్రి కూల్చివేత లో ఎవరి వాట ఎంత అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి 1936లో ఆనాటి పురాతన ఆస్పత్రి భవనం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 1999లో ఆస్పత్రి నిర్మించే సమయంలో పురాతన ఆస్పత్రికి ఏమి చెయ్యకుండా అలానే ఉంచి, అందులో తల్లి పిల్లల కోసం వార్డ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2024లో నిర్మించే కొత్త భవన నిర్మనంకు పురాతన ఆస్పత్రి అడ్డు రావడంతో కూల్చివేశారు 1999లో నిర్మించిన ఆస్పత్రి పైన పటారం.. లోన లొటారం అన్నట్లు ఉంది. ప్రభుత్వ ఆస్పత్రి భవన పరిస్థితి. అంటూ ఆనాడు పలు పత్రికల్లో వార్తలు ప్రచురితం అయ్యాన అధికారులు నాణ్యతకు నీళ్లు వదిలేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న బాన్సువాడ పట్టణ ప్రజలకు శాశ్వత ఆస్పత్రి భవనం ఉండలే లక్ష్యంతో ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎనలేని కృషి చేసి బాన్సువాడ పట్టణానికి మూడు నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రక్క రాష్ట్ర కర్నాటక, మహారాష్ట్ర ప్రజలు ఇక్కడి వచ్చి చికిత్స పొందుతరాని, అలాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఒప్పించి ఆస్పత్రికి నిధులు మంజూరు చెహించి 1997 లో నుటన ఆస్పత్రికి అప్పటి మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో శంకుస్థాపన చేహించారు. అలాగే 1999 చివరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఆస్పత్రి ప్రారంభించారు. 2000వ సంవత్సరంలో అప్పటికే పత్రికలు, నిపుణులు భవన నిర్మాణంలో నాణ్యత లోపిస్తుందని ఆరోపించారు.
లోపం కనిపించింది.. అధికారులకు కనిపించలే..
1998 నాటికి బాన్సువాడ ఆసుపత్రి భవనం నిర్మాణం సాగుతుండగా పనుల్లో నాణ్యత లోపిస్తుందని ప్రజలు, పత్రికలు ఆరోపించాయి. కానీ ఇంజనీర్ అధికారులకు నాణ్యత లోపం ఎక్కడ కనిపించలేదు. అందుకే 50 ఏండ్లు వరకు ఉండవలసిన ఆస్పత్రి భవనం 15 ఏండ్లకే శిథిలావస్థకు చేరింది. గత ఐదు, పది సంవత్సరాల నుంచి కొత్త భవనం కు మరమ్మతులు చేస్తు చేస్తూ వస్తున్నారు. మరమత్తులతో పైపె రంగులతో భవనానికి మెరుగులు దిద్దుతున్నప్పటికీ లోపల లోపాలు అనేకం. ప్రారంభానికి ముందే బీటలువారిన గోడలు దర్శనమిచ్చాయి. అధికారులు, కాంట్రాక్టర్ల ఉదాసీనతతో భవన నిర్మాణంలో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆనాటి అనుభవం ఉన్న వ్యక్తులు ఆరోపించారు. ప్రారంభించిన నెల రోజులకే నాసిరకం పనులు బయట ..నాణ్యత లేమిపై ప్రజల్లో చర్చ సాగింది. పనులను జిల్లా యంత్రాంగం మొదటి నుంచి పర్యవేక్షించింది. అయినా నాణ్యత లోపం బయట పడడం గమనార్హం.
భవిష్యత్తు తరాలకోసమే పెద్ద ఆస్పత్రి: సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం..
నిత్యం నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు గురించి, తన ప్రాంత అభివృద్ధి కోసం పరితపించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని బాన్సువాడ పట్టణ అభివృద్ధిలో భాగంగా కోట్లది రూపాయలతో 1999లో అదునూతన భవనం నిర్మాణం చేసి బాన్సువాడ ప్రజలకు అంకితం చేశారు. బాన్సువాడ నియోజకవర్గ భవిష్యత్తు తరాల ప్రజల కోసం ప్రత్యేక కృషి చేసి సీఎం రేవంత్ రెడ్డికి ఒప్పించి బాన్సువాడ ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి 37. కోట్లల 50 లక్షల రూపాయలను మంజూరు చెహించి ఆసుపత్రి నూతన భవనం కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రవేట్ వ్యక్తులు కట్టుకున్న ఇండ్లు 100 ఏండ్లు ఉంటున్నాయి అదే ప్రవేట్ ఇల్లు కన్న ప్రభుత్వం 20 శాతం అధిక నిధులు ఇచ్చిన ప్రభుత్వ భవనం నిర్మించిన 10- 15 ఏండ్లకే శిథిలావస్థకు చేరడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ పోచారం అధికారులకు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్లు సమిష్టిగా కృషితో భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిలక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు.