– తల్లీకూతురు మృతి
– ఇనుపకడ్డీల సాయంతో ప్రాణాలతో బయటపడ్డ కుమారుడు
నవతెలంగాణ-నెల్లికుదురు
భర్తతో గొడవ పడిన ఓ వివాహిత ఆవేశంలో తన పిల్లలను బావిలోకి నెట్టేసి తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లీ కూతురు మృతి చెందారు. కుమారుడు ఇనుపకడ్డీల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆకుల లావణ్య(30) బంధువుల ఇంట్లో పండుగ విషయంలో భర్తతో గొడవ పడింది. అనంతరం కుమారుడు ముఖేష్, కూతురు నిత్యశ్రీని తీసుకుని ఊరి బయట ఉన్న బావి దగ్గరకు వెళ్లింది. అక్కడ తన పిల్లలను బావిలోకి నెట్టేసి తానూ దూకింది. ఈ ఘటనలో తల్లీకూతురు మృతిచెందారు. కొడుకు ముఖేష్ బావిలో ఉండే ఇనుప కడ్డీల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. లావణ్య అక్క రజిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్టు ఎస్‌ఐ క్రాంతి కిరణ్ తెలిపారు.