రైతే రాజు నినాదం మాటల్లో కాదు చేతల్లో చూపండి..

Raithe Raju's motto is not in words but show it in hands..– ఆయిల్ ఫాం తో పాటు ఏక్వా  కల్చర్ ను ప్రోత్సహించండి…
– కలెక్టర్ జితేష్ వి.పాటిల్
నవతెలంగాణ – అశ్వారావుపేట
రైతే రాజు నినాదం మాటల్లో కాదని చేతల్లో చూపిస్తేనే దానికి సార్ధకత ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఉద్యాన,ఆయిల్ ఫెడ్ అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 16,17 తేదీల్లో రెండు రోజులపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహిస్తున్న చేసిన వ్యవసాయ,ఉద్యాన ఉత్పత్తుల ప్రదర్శన శాలలో ఆయిల్ ఫెడ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫాం,ఉప ఉత్పత్తుల స్టాల్ ను సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,ఎస్పీ రోహిత్ రాజ్ తో సహా కలెక్టర్ జితేష్ వి.పాటిల్  సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఆయిల్ ఫాం సాగు దారులకు ఒక ఎకరానికి సంవత్సర కాలం పాటు ఆయిల్ ఫెడ్ ఇచ్చే రూ.4200 ఏ మాత్రం సరిపోదని,అరకొర రాయితీలు ఇచ్చి రైతును రాజు ను చేస్తాననడం వారిని మభ్యపెట్టడం మే అవుతుందని అన్నారు. ఆయిల్ ఫాం సాగులో అంతర పంటలను ప్రోత్సహించి వారికి అదనపు ఆదాయం చేకూర్చిన నాడే రైతే రాజు నినాదానికి సార్ధకత అని అన్నారు. ఇందుకోసం కోకో,ఏక్వా కల్చర్ ను ప్రోత్సహించాలని అవసరం అయితే పైలెట్ ప్రాజెక్ట్ చేపడితే ప్రభుత్వ పరంగా తన వంతు సహాయం అందిస్తానని,ఆ మేరకు ప్రణాళికలు తయారు చేసి నివేదిక ఇవ్వాలని డీహెచ్ఎస్ఓ సూర్యనారాయణ,ఆయిల్ ఫెడ్ డీవో బాలక్రిష్ణ లకు ఆదేచించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ నర్సరీ ఇంచార్జి మహేష్,ములకలపల్లి ఎఫ్ఓ ఫణి కుమార్,క్షేత్రస్థాయి సిబ్బంది అనిల్ వర్మ,హర్షద్,వికాస్ లు పాల్గొన్నారు.