సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు పక్కాభవనాలను నిర్మించకపోతే ఉద్యమం తప్పదు

– ఎస్ఎఫ్ఐ నాయకులు
– ఎస్ఎఫ్ఐ సమరభేరి సంక్షేమ జీపు జాత రావోజి సంఘం గర్ల్స్ హాస్టల్ వద్ద ముగింపు
– వర్ని నుండి నిజామాబాద్ కు 7 వ రోజుకు చేరిన ఎస్ఎఫ్ఐ యాత్ర బృందం
నవతెలంగాణ -కంటేశ్వర్
సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు పక్కా భవనాలను నిర్మించకపోతే ఉద్యమం తప్పదని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ సమరభేరి సంక్షేమ జీవుజాత రావోజి సంఘం గర్ల్స్ హాస్టల్ వద్ద ముగింపు వర్ని నుండి నిజాంబాద్ కు ఏడవ రోజుకు చేరిన ఎస్ఎఫ్ఐ యాత్ర బృందం అని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) సంక్షేమ హాస్టల్ల పరిరక్షణకై జీపు యాత్ర ఇంటిగ్రేటెడ్ నాల్కల్ హాస్టల్ నుండి ప్రారంభించి రామోజీ సంఘం గర్ల్స్ హాస్టల్ వద్ద యాత్ర ముగింపు పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లపై శ్రద్ధ పెట్టడం కరువైందని అన్నారు. నిజామాబాద్ జిల్లాలోనీ ప్రభుత్వ హాస్టల్లు అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను మరమ్మత్తులు చేయకపోవడంతో జనరల్ వాటర్ తో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని వెంటనే సంక్షేమ హాస్టళ్లకు మెంటల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన మెస్ చార్జీలను జూలై నుండి అమలు చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని అన్నారు. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ లకు ప్రత్యేకంగా హెల్త్ కిట్స్ అందించాలని. హాస్టల్లో అప్లికేషన్ పెట్టిన ప్రతి విద్యార్థికి సీట్లు అందించేటట్టుగా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. కొన్ని అద్దె భవనాలు వర్షాలతో వరుస్తున్నాయని మరియు పెచ్చులు ఓడిపోతున్నాయని వాటికి ఉన్నత అధికారులు మరమ్మత్తులు జరపాలని అన్నారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ లను ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు సందర్శించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. జిల్లాలో మహిళలకు ప్రత్యేకంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను నిర్మించాలని మరియు అదనంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లకూ పక్కా భవనాలు నిర్మించాలని వపోయారు. అదేవిధంగా హాస్టల్స్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నెలలు గడుస్తున్నా ఏజెన్సీలు డబ్బులు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందించాలని ఏజెన్సీలకు గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
 ప్రభుత్వ హాస్టల్లో కనీస వసతులు కల్పించకపోవడం విడ్డూరం అని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్లో ఔట్సోర్సింగ్ గా పని చేస్తున్న వర్కర్లకు ఐదు నెలలు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే ఔట్సోర్సింగ్ వర్కర్లకు జీతాలను అందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. వర్షాల వల్ల హాస్టల్లు శిథిల వ్యవస్థలో ఉండడంతో విద్యార్థులు హాస్టల్స్ నుండి ఇంటికి వెళ్ళే దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వనికే దక్కింది అని విమర్శించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుండి పీజీ ఉచిత విద్య అందిస్తానన్న హామీని నెరవేర్చాలని గుర్తు చేశారు. హాస్టల్లను సర్వే చేయడం జరిగింది. మన ఊరు మన బడి పాఠశాలలను కింద పాఠశాలలను అభివృద్ధి చేయాలని అన్నారు. ప్రభుత్వ హాస్టల్లో ప్రహరీ గోడ మరియు ఫెన్సింగ్ లనూ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు .పెంచిన మెస్ చార్జీలను అమల్లోకి తేవాలి మరియు కాస్మెటిక్ చార్జెస్ నీ పెంచాలని లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, మహేష్,రాష్ట్ర కమిటీ సభ్యురాలు దీపిక, జిల్లా నాయకులు జవహర్, గణేష్, సంధ్య రెడ్డి, అరవింద్, శివ, బాబురావు తదితర నాయకులు పాల్గొన్నారు.