– జనరల్ బోగీల సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైళ్లలో జనరల్ బోగీలను పెంచుతామని కేంద్రం చేసిన ప్రకటన కార్యరూపం దాల్చేవరకు ఉత్తరాల ఉద్యమాన్ని కొనసాగిస్తామని జనరల్ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్ బోగీలు పెంచేందుకు మొదలెట్టిన కోటి ఉత్తరాల ఉద్యమంలో ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల నుంచి 10 లక్షల ఉత్తరాలు కేంద్రానికి చేరాయని తెలిపారు. దీంతో జనరల్ బోగీల పెంపు ప్రకటన చేసిందంటూ హర్షం వ్యక్తం చేశారు ఇదే ఉత్సాహంతో ఉద్య మాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరూ ఉత్తరాలు, ట్విట్టర్, ఈ-మెయిల్ ద్వారా ఆకాంక్షలను కేంద్రానికి తెలపాలని అశోక్ పిలుపునిచ్చారు.