వేసవిలో చల్లని చిరుగాలి లాంటి సినిమా..

స్వప్న సినిమా నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకురాలిగా సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శిల్పకలావేదికలో ఆహ్లాదకరంగా జరిగింది. ఈ సందర్భంగా దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ, వైజయంతి మా ఫ్యామిలీ లాంటి సంస్థ. వీరితో అవకాశం వస్తే వదులుకోను. సంతోష్‌ ఇందులో చాలా ఛార్మింగ్‌గా ఉన్నాడు. కామెడీ టైమింగ్‌ బాగుంది’ అని అన్నారు.నాని మాట్లాడుతూ, ‘దర్శకురాలు నందినీ స్పెషల్‌ మూవీ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ లడ్డూలా ఉంది. అన్ని శాఖలు బాగా కుదిరాయి. మాళవిక నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’కు మంచి పేరు వచ్చింది. సంతోష్‌లో చాలా ఈజ్‌ ఉంది. నందినికి మరో నాని సంతోష్‌ రూపంలో దొరికాడు. అందరికీ గుర్తుండేలా ఈ సినిమా స్పెషల్‌ మూవీ అవుతుంది.
18న మార్నింగ్‌ షోకు వస్తున్నాను. మీరూ రండి. రిలీజ్‌ కు ముందు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి’ అని చెప్పారు. నటి గౌతమి మాట్లాడుతూ,’సమ్మర్‌లో కూల్‌ సినిమా అంటున్నాం. కానీ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి. అలాగే అన్నీ అంశాలు ఉన్న ఈ సినిమా హదయాన్ని టచ్‌ చేస్తుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమాతో 24 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాను. సినిమా బాగా వచ్చింది. లెజెండ్రీ నటీనటులు నటించారు. ఇందులో నటించడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు. నిర్మాత స్వప్నాదత్‌ మాట్లాడుతూ, ‘ఈనెల 18న గొప్ప సినిమా మీ ముందుకు వస్తుంది. మన అమ్మమ్మగారి ఇంటికివెళ్లి మామిడికాయ తిన్నంత హ్యాపీ ఫీలింగ్‌ కలుగుతుంది’ అని అన్నారు.
‘నానితో ‘అలా మొదలైంది’ సినిమా తీశాను. ఈ రోజు తనతోపాటు దుల్కర్‌ ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉంది. వైజయంతిలో సినిమా చేయటం అదృష్టం. ఓ మంచి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆశీర్వదించండి’ అని చెప్పారు.
నాకు మొదటగా చెక్‌ ఇచ్చిన ప్రియాంక అక్కని మర్చిపోలేను. నా మొదటి సినిమాను నాని చూసినప్పుడు థియేటర్‌లో నిల్చుని చూశారు. అదేమిటంటే, తన సినిమా కూడా అలాగే చూస్తానని అన్నారు. ఆయన సపోర్ట్‌కు థ్యాంక్స్‌. ఇక దుల్కర్‌ సల్మాన్‌ చాలా నార్మల్‌గా ఉంటారు. నేను సీతారామం మ్యూజికల్‌ ఫేవరేట్‌ అయ్యాను. వైజయంతి మూవీస్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. స్వప్న అక్క చాలా హార్డ్‌ వర్కర్‌. నందినీ రెడ్డి దర్శకత్వంలో నటించడం చాలా హ్యాపీగా వుంది. ఇంతమంది సీనియర్స్‌తో పనిచేయడం గౌరవంగా, అదష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చూశాక మీ మనసు తేలిక అవుతుంది.
– హీరో సంతోష్‌ శోభన్‌
నటిగా నాకు చక్కటి గౌరవాన్ని ఇచ్చారు. ‘ఎవడే..’ సినిమా నుంచి మంచి గ్రోత్‌ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్‌, వాసుకీ, నరేష్‌ ఇలా అందరితో, ముఖ్యంగా సంతోష్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా వేసవికి చిరుగాలిలా ఉంటుంది.
– హీరోయిన్‌ మాళవిక నాయర్‌