మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో వరుణ్ సందేశ్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ఈ మూవీలో నా లుక్ కొత్తగా ఉండేలా మా డైరెక్టర్ ఆద్యంత్ హర్ష డిజైన్ చేశారు. రెండు డిఫరెంట్ కలర్స్‌లో వెరైటీగా హెయిర్ స్టైల్, ముక్కు పుడక, టాటూస్‌తో ఒక కొత్త మేకోవర్ చేయించారు. నాకు కథ కంటే ముందు నేను ఈ సినిమాలో చేసిన ఆండీ క్యారెక్టర్ లుక్ ఎలా ఉంటుందో డైరెక్టర్ వివరించారు. అది నాకెంతో బాగా నచ్చింది. ఇదొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మెంటల్ ఆస్పత్రి దగ్గర కొద్దిమంది ఉంటారు. వారి దగ్గరకు ఆండీ వస్తాడు. అతను వచ్చాక గందరగోళం మొదలవుతుంది. అదేంటి అనేది తెరపై చూడాలి. ఈ కథలో అంతర్లీనంగా సోషల్ మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో నా లుక్ చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వచ్చాయి. కానీ వాటికి ఈ సినిమానే సమాధానం చెబుతుంది. ఈ సినిమా చూశాక నేను ఎందుకు ఈ మేకోవర్‌లో ఉన్నానని తెలుసుకుంటారు. ఈ సినిమా చూశాక ఆండీ క్యారెక్టర్ పట్ల గర్వపడతారు. ఈ కథలో చాలా టిస్టులు, టర్న్స్ ఉంటాయి. ఒక మంచి మూవీ చేశామని మేమంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమా చూశాక చాలా ఎమోషనల్ అయ్యాను. చివరలో హార్ట్ టచింగ్‌గా అనిపించింది. నా వైఫ్ వితిక కూడా సినిమా చూసి అలాగే ఫీలయ్యింది. ఈ సినిమాలో సగం తెలుగు, సగం ఇంగ్లీష్ మాట్లాడుతుంటా. ఇది నా బాడీలాంగ్వేజ్‌కు కంఫర్ట్‌గా అనిపించింది. ఈ మూవీ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎబనెజర్ పాల్ ఈ చిత్రానికి అద్భుతమైన బీజీఎం ఇచ్చాడు. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. థియేటర్లలో ఆ అను భూతి కొత్తగా ఉంటుంది. ఆయన ఇప్పుడు మరో మూడు బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ సైన్ చేయటం హ్యాపీగా ఉంది.ఏపీలో టూర్ చేశాం. ఆ టూర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టూర్ విశేషాలు ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నా. చీకట్లో ఉన్న వారికి వెలుగు పంచే వాడు విరాజి. ఇదే టైటిల్ జస్టిఫికేషన్. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్, డ్రామా, ఎమోషన్ వంటి అన్ని అంశాలు కథలో కలిపి రూపొందించారు దర్శకుడు ఆద్యంత్ హర్ష. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మా మూవీ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఈ వారం దాదాపు పన్నెండు సినిమాలు రిలీజ్‌కు వస్తున్నాయి. వాటిలో మా మూవీ కనిపిస్తుందంటే దానికి మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్ల చేయిస్తున్న ప్రమోషనే కారణం. ఈ కథను అలాంటి ప్రొడ్యూసర్ మాత్రమే నిర్మించగలరు.
ఆ కామెంట్స్‌కి సినిమానే సమాధానమిస్తుంది
Related posts: