– కాంగ్రెస్, బీజేపీ పార్టీలో తీవ్ర పోటీ
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగియగానే ఇక సర్పంచుల ఎన్నికలపై పట్టు బిగుస్తుంది ఆయా పార్టీల నాయకులు పోటీ చేసేందుకు ఒక్కొక్క పార్టీలో ఇద్దరు ముగ్గురు నలుగురు పేర్లు వినబడుతున్నాయి. మద్నూర్ మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎన్నికకు పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లలో తీవ్ర పోటీ కనిపిస్తుంది ఒక్కొక్క పార్టీలో ఇద్దరూ ముగ్గురు నలుగురు ఐదుగురు పేర్లు ముందుకు వినిపిస్తున్నాయి. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలలో వర్గ పోరు అధికంగా కనిపిస్తోంది. నేనంటే నేనే సర్పంచ్ గా పోటీ చేస్తానంటూ ఇరు పార్టీల లో సర్పంచ్ ఎన్నిక కోసం పోటీ తీవ్రంగా కనిపిస్తుంది. ఆయా పార్టీల ఐకమండ్ ఎవరి పేరు ప్రతిపాదిస్తుందో కానీ సర్పంచ్ ఎన్నిక కోసం మద్నూర్ మండల కేంద్రంలో గత రెండు రోజుల నుండి కాంగ్రెస్, బీజేపీ పార్టీల కు చెందిన వారు తమ పేర్లను బయటకు చెప్పుకుంటున్నారు. పార్టీ ఐకామాండు తనను కాదంటూ మరొకరి పేరు తీసుకువస్తే రెబల్గా పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో వర్గ పోరు మొదలైనట్లు తెలుస్తోంది. గెలుపు ఓటమిలపై ఆయా పార్టీల నాయకులే వ్యతిరేకంగా పోటీపడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో సర్పంచ్ల ఎన్నికలు జూన్ మాసంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో, గత రెండు రోజులుగా సర్పంచ్ ఎన్నికలపై నాయకుల హడావుడి మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తుంటే, ఇక బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేయడానికి ఎవ్వరూ ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సర్పంచ్ గా పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకుల పేర్లు ముందుకు రాకపోవడం, సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీలో ఉంటుందా ఉండదా అనేది చర్చనీయాంశంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ఎన్నిక జరిగినట్లుగానే సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ ప్యానల్ అభ్యర్థుల మధ్యనే తీవ్ర పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ ఎన్నిక పట్ల తీవ్ర పోటీ కనిపిస్తోంది. లక్షలాది రూపాయలు ఖర్చులు చేసేందుకు పోటీ దారులు సిద్ధమవుతున్నారు మద్నూర్ సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.