పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన ఎంపీఓ

The MPO inspected the sanitation programsనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని కొన సముందర్ లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను శనివారం మండల పంచాయతీ అధికారి సదాశివ్  పరిశీలించారు. గ్రామంలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ జ్వరం, దోమల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టారు. గ్రామంలోని అన్ని వాటర్ ట్యాంక్ ల వద్ద, మురికి కాలువల వెంట  గ్రామ పంచాయతీ సిబ్బందితో  బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.ఈ సందర్భంగా ఎంపీవో సదాశివ్  మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలు వృద్ధి చెందడం వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆరుబయట వాడకుండా ప్రక్కన పెట్టిన వస్తువుల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.నీరు నిల్వ ఉండడం వల్ల ఈగలు, దోమలు వృద్ధి చెంది ప్రజలు  అనారోగ్యాల బారిన పడతారన్నారు. సీజనల్ వ్యాధులు  ప్రబలకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్, తదితరులు పాల్గొన్నారు.