పారిశుద్ధ్య పనులు పరిశీలించిన ఎంపీఓ

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఎంపీఓ, గ్రామ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. మురికి కాలువలు, చెత్తాచెదారం లేకుండా, దోమల నివారణ కొరకు మంచినీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి దయాకర్ కు సూచించారు. అలాగే గ్రామ సర్పంచుల పాలన ముగిసిన అనంతరం బస్వాపూర్ గ్రామానికి ప్రత్యేక అధికారిగా నియమితులైన ప్రవీణ్ కుమార్ ను సీడీసీ  డైరెక్టర్ మల్లేష్ మల్లారెడ్డి, గ్రామ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.