రోడ్డు గుంతలు పూడ్చి వేయించిన మున్సిపల్ చైర్ పర్సన్ 

The municipal chair person who filled the road potholesనవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు రోడ్లన్నీ గుంతల మయం కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ పట్టణంలో ఎక్కడ ఏ గుంత కనిపించకూడదని సూచన మేరకు సోమవారం  రోడ్డు గుంతలను పూరించడం జరిగిందని  మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలోని 26,45,,వ వార్డ్ లోని  రోడ్డు గుంతలను పూరించడం జరిగిందనీ,  ఇటీవల కురిసిన వర్షాలకు బల్దియా పరిధిలోని ప్రధాన రోడ్లు దెబ్బతి న్నాయన్నారు. బల్దియా ఆధ్వర్యంలో  గుంతలు పూడించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగిందన్నారు. ఓ వైపు రోడ్లు బాగు చేస్తూనే వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేప డుతున్నాట్లు ఆమె పేర్కొన్నారు.  పాంచ్ చౌరస్తా నుంచి  వెళ్లే రహదారి, ఇస్లాంపుర గల్లీ తదితర చోట్ల గుంతలతో అధిక సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించామని, వీటిని మున్సిపల్ సిబ్బందితో పూడ్చి వేయిస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్  పిట్ల వేణు గోపాల్, హనుమాన్ల మానస సురేష్, సానిటేషన్ ఎస్సై పర్వేజ్, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.