బాన్సువాడ పట్టణంలోని మున్సిపాలిటీ 18 వ వార్డులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణ సర్వేను మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ప్రారంభించారు. ఇంటి యజమానులకు సమగ్ర సర్వే స్టిక్కర్ ను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, కౌన్సిలర్ కాసుల రోహిత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్ బీన్ మోసిన్, మోతిలాల్, నాయకులు ఎజాస్, నర్సు గొండ, ఆఫ్రోజ్, నార్ల ఉదయ్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.