
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నాయకులు బి. వెంకటేష్ నూతనంగా ఏర్పాటు చేసిన రాంరెడ్డి చికెన్ సెంటర్ ను బుధవారం మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చికెన్ సెంటర్ మంచి లాభాలతో ముందుకు కొనసాగాలని భగవంతుని కోరుకున్నారు. అనంతరం చికెన్ సెంటర్ యజమాని వెంకటేష్ వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పార్టీ మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్, జిల్లా నాయకుల సుంకరి జనార్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మిలాల్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.