నవతెలంగాణ -శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని ఎరడపల్లి గ్రామంలో పల్లె దవఖానని గురువారం జాతీయ నాణ్యత ప్రమాణాల సూచిక బృందం డాక్టర్. సుశీల్ దేవనీరు చావన్, డాక్టర్ సుస్మిత హల్దార్ లు తనిఖీ చేశారు. పల్లె దవఖానాలో అందిస్తున్న వైద్య సేవలపై తనిఖీ నిర్వహించి,కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారని
దీంతో పల్లె దవాఖానకు మరిన్ని సౌకర్యాలు చేకూరుతాయని డిపిఓ తులసి రవీందర్ తెలిపారు. కేంద్ర బృందంతో పాటుగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు, క్వాలిటీ మేనేజర్ సాగర్, హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, ఎంపిహెచ్ఈఓ ఎం రామనాథం,స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్, ఎరడపల్లి డాక్టర్ సురేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.