స్కిల్‌ కేసులో ఆ పేరు ‘పొరపాటే’..

In the case of skill That name is 'Porapate'..అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ ఏపీ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కిలారు రాజేష్‌ పేరును పొరపాటున నిందితుడు అని తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లు సీఐడీి హైకోర్టుకు తెలియజేసింది. ఆ పేరు తొలగింపునకు అధికారులకు మౌఖికంగా ఉత్తర్వులు ఇచ్చారని సీఐడీి తరఫున ప్రత్యేక పిపి వివేకానంద చెప్పారు. తన పేరును సాక్షి, ఆ తర్వాత నిందితుడిగా పేర్కొంటూ సీఐడీి వెబ్‌సైట్‌లో ఉండటాన్ని సవాల్‌ చేస్తూ రాజేష్‌ దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. తెలంగాణలో నివాసముండే పిటిషనర్‌కు నోటీసులు ఇచ్చే అధికారం ఏపీి సీఐడీిికి లేదని సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు.
పిటిషనర్‌ కోసం లుక్‌ఔట్‌ నోటీసు కూడా ఇచ్చారన్నారు. పిటిషన్‌ను కొట్టేయాలని సీఐడీి కోరింది. కౌంటర్‌ వేసేందుకు గడువు కావాలని కోరడంతో విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది.